Ramanathapuram
-
పోటీకి సై అంటే.. డీఎంకేకు మద్దతు ఇస్తా!
సాక్షి, చైన్నె : రామనాథపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే పక్షంలో, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థి రంగంలో ఉంటే వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ప్రకటించారు. లేదంటే తాను బరిలో దిగుతామని స్పష్టం చేశారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌పై సినీ నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు చర్చకు దారి తీసి ఉన్న విషయం తెలిసిందే. సీమాన్‌ను విచారించేందుకు పోలీసులు సమన్లు సైతం జారీ చేసి ఉన్నారు. ఆయన్ని అరెస్టు కూడా చేయవచ్చు అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో విజయలక్ష్మికి వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి వర్గాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆదివారం అనూహ్యంగా సీమాన్ డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ.. కోయంబత్తూరులో సీమాన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే తన పార్టీ పెద్దదని, ఆ మేరకు తనకు ఓటు బ్యాంక్ ఉందన్నారు. అందుకే తనను ఎన్నికల వేళ ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా పరిణామాలను గుర్తుచేశారు. ఒకవేళ రామనాథపురం నుంచి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తే, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో తాను అన్ని చోట్ల ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలాగే డీఎంకేకు మద్దతు ఇస్తానని స్పష్టం చే శారు. అయితే, ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీజేపీని డీఎంకే ఒక్కటే ఢీకొట్టే పరిస్థితులు లేవుని , ఇందుకు గత ఎన్నికలే నిదర్శనంగా పేర్కొన్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలను మిత్ర పక్షాలకు డీఎంకే కేటాయిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. -
బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే
చెన్నై: తమిళనాడు బీజేపీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శశికళను బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకునేందుకు పలుమార్లు ట్రై చేశాడు. ఆమె మాత్రం ఈ చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY — இசை (@isai_) September 13, 2022 ఈ వీడియోను సరిగ్గా చూపేందుకు స్లో మోషన్లో ఎడిట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అది పెద్ద సమస్యా? అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి సందర్భంగా రామనాథపురం జిల్లాలో నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీఎంకే ఆరోపణలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో బీజేపీ నేత ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. డీఎంకే దురుద్దేశంతోనే ఈ వీడియోను ఎడిట్ చేసిందన్నారు. మరోవైపు బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
అమ్మ చెప్పిందని టీచర్‌ను పొడిచేసేందుకు..!
రామనాథపురం: అమ్మ చెప్పిందని ఓ 11 ఏళ్ల బాలిక టీచర్‌ను బాకుతో పొడిచేందుకు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో జరిగింది. దక్షిణ తమిళనాడులోని రామనాథపురంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం టీచర్‌కు చెప్పకుండా క్లాస్ మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఉపాధ్యాయురాలు తిడుతుందేమోనన్న భయంతో శనివారం బడికి వచ్చేటప్పుడు తల్లిని వెంటబెట్టుకొని వచ్చింది. టీచర్ ఇద్దరిని వెళ్లి ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. దీంతో టీచర్‌కి, విద్యార్థిని తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ టీచర్‌ను పొడిచేయమంటూ కూతురికి చెప్పింది. వెంటనే ఆ చిన్నారి ఒక బాకు తీసుకొని టీచర్‌ను పొడిచేందుకు పూనుకుంది. భయభ్రాంతురాలైన టీచర్ వెంటనే అల్లారం మోగించి.. ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలియజేసింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. టీచర్‌పై దాడికి ప్రయత్నించిన తల్లీకూతుళ్లను పోలీసులు కాసేపు ప్రశ్నించి వదిలేశారు. అయితే తన కూతురిని టీచర్ తరచూ వేధిస్తున్నదని, తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నదని విద్యార్థిని తల్లి ఆరోపించింది. టీచర్ నుంచి భద్రత కోసమే తన కూతురు బాకును చేతిలో పట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది. -
ఫిర్యాదుదారుపై ఎస్ఐ కాల్పులు
-
ఫిర్యాదుదారుపై ఎస్ఐ కాల్పులు
రామనాథపురం: చెన్నై నగరంలోని రామనాథపురం పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. మహమ్మద్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి రాగా, అతనికి సబ్ ఇన్స్ ఫెక్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఎస్ఐ కాళిదాసు ఆవేశంతో మహమ్మద్ కాల్పులు జరిపినట్టు తెలిసింది. కాల్పుల్లో గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. -
బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం
-
బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం
రామనాథపురం: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. రామనాథపురం సమీపంలోని కీళ్లకరైలో వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకోవడం ఈ దారుణ ఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రామనాథపురంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు. యాత్రికులు రామేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఒంటరి పోరే ముద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి:లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఒక్కరోజు పర్యటనకు వచ్చిన రాహుల్ సోమవారం రామనాథపురంలో ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నుం చి ప్రత్యేక విమానంలో మదురైకి అక్కడి నుంచి హెలికాప్టర్లో రామనాథపురానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు నాటి కాంగ్రెస్ నేత కామరాజనాడార్ పాలనను మర్చిపోలేదని, మధ్యాహ్న భోజన పథకం ఆయనే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకానికి తాము మరిన్ని మెరుగులు దిద్దామని తెలిపారు. ఈ పథకం వల్ల లక్షలాదిమంది విద్యార్థుల ఆకలి తీరుతోందన్నారు. అటువంటి కామరాజనాడార్ పాలనను రాష్ట్రంలో మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయడం వల్ల రాష్ట్రంలో కూడా అధికారం ఖాయమని తెలుస్తోందని అన్నారు. ఈ లోక్‌సభే కాదు ఇకపై అన్ని ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో కనపడుతున్న ఉత్సాహం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమిళనాడులో మత్స్యకారులదే ప్రధాన సమస్యగా తాము భావిస్తున్నామని చెప్పారు. జాలర్ల ప్రతినిధుల కోరిక మేరకే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జాలర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. తమిళ జాలర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లు ఖర్చుచేసిందని, అయితే కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నట్లుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరేంద్రమోడీ తమిళనాడు ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా గుజరాత్ అభివృద్ధిని ఏకరువు పెట్టారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూటములుగా ఏర్పడి మభ్యపెడుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో రావని చెప్పారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు పీ చిదంబరం, జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, రామనాథపురం అభ్యర్థి తిరునావుక్కరసు తదితరులు రాహుల్తోపాటూ వేదికపై ఉన్నారు. -
నదీ జలాలకు శాశ్వత పరిష్కారం!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించే ప్రభుత్వం కేంద్రం లో ఏర్పాటయితే నదీ జలాల పంపిణీ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. సేతు సముద్రం ప్రాజెక్టుతో తమిళనాడుకు ఒరిగేది శూన్యం అని, జాలర్ల బతుకులు ఆ ప్రాజెక్టుతో ఛిన్నాభిన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ ప్రజల ప్రభుత్వం కేం ద్రంలో ఏర్పడడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులకు మద్దతుగా సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. ఆదివారం రామనాథపురంలో అక్కడి అభ్యర్థి అన్వర్ రాజాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జయలలితకు జనం బ్రహ్మరథం పట్టారు. నదీ జలాలు: జయలలిత ప్రసంగిస్తూ తమిళ ప్రజలకు ఉపయోగపడని పథకాలను కేంద్రం అమల్లోకి తెచ్చే యత్నం చేసిందని శివాలెత్తారు. నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రోడ్లు, తాగునీరు, మౌళిక వసతుల కల్పనలో తాము ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించారు. ఇక్కడ నిర్లవణీకరణ పథకం అమలుకు ఒప్పందాలు ఆహ్వానించామని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. అన్నాడీఎంకే కీలక భూమిక పోషించే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే, నదీ జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించారు. ఛిన్నాభిన్నం: సేతు సముద్రం ప్రాజెక్టుతో తమిళులకు ఒరిగేది శూన్యమేనన్నారు. ఆ ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నారో చెప్పాలని తాను పలు వేదికలపై ప్రశ్నలు విసిరానని, ఇందుకు కాంగ్రెస్, డీఎంకే నాయకులు ఎవరూ నోరు మెదపక పోవడం బట్టి చూస్తే, ఆ పథకంతో ప్రజలకు ఉపయోగం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే జల జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, జాలర్ల బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సేతు సముద్రం కోసం తవ్వే కాలువలో పెద్ద నౌకలు పయనించేందుకు వీలు లేదని, అలాంటప్పుడు ఎలా ఎగుమతులు ఈ మార్గంలో సాగుతాయో చెప్పండంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయని, అందువల్లే తాను దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ. 230 కోట్లు ఖర్చు పెట్టి, ప్రజా ధనాన్ని బుగ్గి పాలు చేశారని మండిపడ్డారు. కోత ల రహిత రాష్ట్రం: రాష్ట్రాన్ని కోతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం తన లక్ష్యంగా పేర్కొన్నారు. డీఎంకే సర్కారు పుణ్యమా రాష్ట్రం అంధకారంలో మునిగిందని గుర్తు చేశారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత తన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయని వివరించారు. అందువల్లే తాత్కాలికంగా విద్యుత్ కోత విధించాల్సి వచ్చిందన్నారు. అయితే, రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేసినట్టు, ఇక, విద్యుత్ కోతల మోత తప్పదన్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను చూడబోతోందని, కోతల రహిత రాష్ట్రంగా తమిళనాడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాబోతోందని ప్రకటించారు. -
ఆరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం
అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల యువకుడు ఆర్ ఎన్ కొట్టాయి అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులోని రామనాథ్పురంలో కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం... రామనాథ్పురంలో ఆర్ ఎన్ కొట్టాయి అనే యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఎదురింట్లోని చిన్నారికి ఆశపెట్టి, ఆ చిన్నారి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిపాడు. ఆ బాలిక తీవ్ర గాయాలపాలై బిగ్గరగా ఏడవటంతో స్థానికులు వెంటనే స్పందించారు. ఆ బాలిక తల్లితండ్రులకు సమాచారం అందించారు. దాంతో బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ బాలికను పరీక్షించి అత్యాచారం జరిగిందని, బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించంతో బాలిక తల్లితండ్రులకు ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానికులను వాకబు చేయగా ఎదురింటి వ్యక్తిపై వారు అనుమానం వ్యక్తం చేయగా, అతడ్ని నిలదీశారు. దీంతో అతడు చేసిన తప్పును ఒప్పకున్నాడు. దాంతో ఆ బాలిక తల్లితండ్రులతోపాటు స్థానికులు మండిపడ్డారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేశారు. దాంతో అతడు తీవ్ర గాయాలపాలై, సృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.