బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం | Five Pilgrims Killed After Their Bus Catches Fire in Tamil Nadu | Sakshi
Sakshi News home page

బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం

Published Sun, Aug 31 2014 8:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం

బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.

రామనాథపురం: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. రామనాథపురం సమీపంలోని కీళ్లకరైలో వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకోవడం ఈ దారుణ ఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రామనాథపురంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు. యాత్రికులు రామేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement