bus catches fire
-
ఓఆర్ఆర్పై ప్రమాదం: బస్సులో చెలరేగిన మంటలు
-
బస్సులో మంటలు : ముగ్గురు సజీవ దహనం
జైపూర్: ఢిల్లీ-జైపూర్ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హై టెన్సన్ విద్యుత్తు తీగల కారణంగా మంటలు అంటుకున్నాయని స్థానిక పొలీసు అధికారి అనితా మీనా తెలిపారు. మీనా అందించిన సమాచారం ప్రకారం లాబానా గ్రామ సమీపంలో ట్రక్కు బోల్తా పడటంతో డ్రైవర్ వాహనాన్ని రాంగ్రూట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే భగవాన్ సింగ్, నూర్ మొహమ్మద్, శుభానా అనే ముగ్గురు ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోగా, ఇతర ప్రయాణికులు సురక్షితం ఉన్నారని మీనా వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
-
కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
సాక్షి, కర్నూలు : జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగమర్రి మద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. దాదాపు కోటికి పైగా నష్టం జరిగినట్టుగా సమాచారం. బస్సు వెనుక భాగం నుంచి మంటలు మొదలైనట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బస్సులో మంటలు..తప్పిన ప్రమాదం
-
నడిరోడ్డు పై బస్సులో మంటలు
-
బస్సుకు మంటలు: పదిమంది మృతి
దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో బస్సుకు మంటలు అంటుకున్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు ముందుటైర్లు పేలిపోవడంతో అది డివైడర్‌కు ఢీకొని మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించేలోపే మంటలు బాగా వ్యాపించాయి. దాంతో పదిమంది లోపలే మరణించారు. మరో ఏడుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ముగ్గురు మాత్రం దీన్నుంచి బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెన్నై సమీపంలో కాల్పుల కలకలం
-
బస్సులో మంటలు:26 మంది సజీవదహనం
తైపీ: బస్సులో బయలుదేరిన వారంతా కొద్దిసేపట్లో విమానాశ్రయానికి చేరుకునేవారు.. ఒకటి, రెండు గంటల్లో ఎవరింటికి వారు వెళ్లిపోయేవారు. కానీ వారిని అగ్ని.. గండంలా చుట్టుముట్టింది. డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను దహించివేసింది. ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతున్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట తర్వాత గానీ మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రవేశద్వారం వద్ద మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటాన్ని బట్టి.. వారంతా బయటకు వచ్చే ప్రయత్నం చేసుంటారనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ క్లూస్ టీమ్ సభ్యులు చెప్పారు. చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారని, వీరంతా చైనాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగటానికి ముందు బస్సు రోడ్డుకు ఒక పక్కగా వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందీ, మంటలు ఎలా చెలరేగిందీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. -
బస్సులో మంటలు:26 మంది సజీవదహనం
-
బస్సులో మంటలు:9మంది దుర్మరణం
అమేథీ : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమేథీ జిల్లా పీపర్పూర్ సమీపంలో ఓ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ రోజు ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజన్లో మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందినవారి వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు
-
బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం
-
బస్సులో సిలిండర్ పేలి ఐదుగురు సజీవదహనం
రామనాథపురం: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. రామనాథపురం సమీపంలోని కీళ్లకరైలో వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకోవడం ఈ దారుణ ఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రామనాథపురంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు. యాత్రికులు రామేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
ట్యాంకర్, వోల్వో బస్సు డీ
-
ట్యాంకర్, వోల్వో బస్సు డీ: 8 మంది సజీవదహనం
ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్, ఎదురుగా వస్తున్న వోల్వో బస్సును ఢీ కొట్టింది. దాంతో వోల్వో బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఎనిమిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో జరిగింది. బీపీసీఎల్ ట్యాంకర్ గుజరాత్ లోని హజారియా ప్రాంతానికి వెళ్తోంది. ఈ రెండు వాహనాలు ఢీకొనడంతో రెండింటికీ మంటలు అంటుకున్నాయి. అయితే మృతులు మాత్రం అంతా బస్సులోని వారేనని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మసిబొగ్గులుగా మారిపోవడంతో గుర్తుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అయినా వాటిని పోస్టుమార్టం కోసం పంపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం మే 29వ తేదీన కూడా ఇలాంటి ప్రమాదమే ఒకటి సంభవించింది. ఆ ప్రమాదంలో 14 మంది మరణించగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
నేడు మరో 8 మంది మృతదేహాలనివేదికలు అందే అవకాశం
-
తెలవారుతుండగానే తెల్లారిన బతుకులు