ఆరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం | Boy thrashed by public after raping 6-year old | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

Published Wed, Dec 25 2013 12:22 PM | Last Updated on Fri, Jul 12 2019 3:31 PM

అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల యువకుడు ఆర్ ఎన్ కొట్టాయి అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులోని రామనాథ్పురంలో కలకలం రేపింది.

అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల యువకుడు ఆర్ ఎన్ కొట్టాయి అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులోని రామనాథ్పురంలో కలకలం రేపింది.  పోలీసులు కథనం ప్రకారం... రామనాథ్పురంలో ఆర్ ఎన్ కొట్టాయి అనే యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఎదురింట్లోని చిన్నారికి ఆశపెట్టి, ఆ చిన్నారి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిపాడు. ఆ బాలిక తీవ్ర గాయాలపాలై బిగ్గరగా ఏడవటంతో స్థానికులు వెంటనే స్పందించారు. ఆ బాలిక తల్లితండ్రులకు సమాచారం అందించారు. దాంతో బాలికను ఆసుపత్రికి తరలించారు.

 

వైద్యులు ఆ బాలికను పరీక్షించి అత్యాచారం జరిగిందని, బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించంతో బాలిక తల్లితండ్రులకు ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానికులను వాకబు చేయగా ఎదురింటి వ్యక్తిపై వారు అనుమానం వ్యక్తం చేయగా, అతడ్ని నిలదీశారు. దీంతో అతడు చేసిన తప్పును ఒప్పకున్నాడు. దాంతో ఆ బాలిక తల్లితండ్రులతోపాటు స్థానికులు మండిపడ్డారు.

 

అనంతరం అతడికి దేహశుద్ధి చేశారు. దాంతో అతడు తీవ్ర గాయాలపాలై, సృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement