
సాక్షి, హైదరాబాద్: హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్య, మరో 11 మంది సైనికుల పార్థివదేహాలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సూలూరు ఎయిర్‌బేస్‌లో ఘన నివాళి అర్పించారు. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించిన ఆమె అక్కడ చికిత్స పొందుతున్న కెప్టన్ వరుణ్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.