ఫీల్డ్ మార్షల్ కరియప్ప పాత చిత్రం, మాట్లాడుతున్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
సాక్షి, కొడుగు : ఇండియన్ ఆర్మీ మొదటి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కొడెండెర మాడప్ప కరియప్పకు భారత అత్యున్నత పౌర పుసరస్కారం భారతరత్న కోసం సిఫార్సు చేసినట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. భారతరత్న పురస్కారం అందుకోవడానికి ఆయన అన్ని విధాల అర్హుడని బిపిన్ రావత్ పేర్కొన్నారు. కర్నాటకలోని కొడగు జిల్లాల్లోనే విద్యాభ్యాసం చేసిన కేఎం కరియప్ప తరువాత భారత సైన్యంలో చేరి.. ఆర్మీ చీఫ్‌గా, ఫీల్డ్ మార్షల్‌గా పనిచేశారని ఆయన చెప్పారు.
శనివారం కొడుగులొ పర్యటించిన రావత్.. ఫీల్డ్ మార్షల్ కరియప్ప, ‘పద్మభూషణ్’ కొడెండొర సుబ్బయ్యల విగ్రహాలను ఆవిష్కరించారు. ‘‘భారతరత్న పురస్కారానికి కరియప్ప అనర్హుడు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా మనకు కనిపించదు.. ఎందరినో ఆ పురస్కారంతో గౌరవించారు.. దేశానికి, సైన్యానికి దిశానిర్దేశం చేసిన కరిపయప్పను కూడా ఆ పురస్కారంతో గౌరవించాలి’’ అని బిపిన్ రావత్ ప్రభుత్వాన్ని కోరారు.
దటీస్ కరియప్ప : ఫీల్డ్ మార్షల్‌గా 5స్టార్ ర్యాంకు సాధించిన ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. 1949లో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు. రెండొప్రపంచ యుద్ధంలో లోనూ, 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలోనూ కరియప్ప పాల్గొన్నారని రావత్ గుర్తు చేశారు. 1949లో కరియప్పను ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు, కేఎం కరియప్ప కుమారుడైన కేసీ కరియప్ప ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ మార్షల్‌గా, స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. కేసీ కరియప్ప 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నట్లు రావత్ చెప్పారు. 1993లో కరియప్పన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment