kariyappa
-
కేపీఎల్ కథ...
ఐపీఎల్ తరహాలో రాష్ట్ర స్థాయిలో లీగ్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన తొలి టోర్నీ. 2009లో మొదలైంది. ముందుగా ఎనిమిది జట్లతో మొదలైనా ప్రస్తుతం 7 టీమ్‌లు ఉన్నాయి. భారత్‌కు ఆడిన కర్ణాటక అగ్రశ్రేణి క్రికెటర్లంతా పాల్గొంటుండటంతో లీగ్‌పై అందరి దృష్టీ పడింది. భారీ స్పాన్సర్‌షిప్‌లు, టీవీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. డీన్ జోన్స్, బ్రెట్‌లీలాంటి స్టార్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఒక దశలో ఆకర్షణ కోసమంటూ కన్నడ సినీ, టీవీ ఆర్టిస్టులతో కూడిన ‘రాక్‌స్టార్స్’ అనే టీమ్‌ను కూడా లీగ్ బరిలోకి దించారు. కేపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే కరియప్ప, శివిల్ కౌశిక్‌లాంటి క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఈ లీగ్‌కు వివాదాలు కొత్త కాదు. 2011లో టోర్నీ నిర్వహణా తీరును సందేహిస్తూ కుంబ్లే, శ్రీనాథ్‌లాంటి దిగ్గజాలు విమర్శించారు. వీరిద్దరు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన తర్వాత మూడేళ్ల పాటు లీగ్‌ను నిర్వహించకుండా నిలిపివేశారు. అయితే కుంబ్లే, శ్రీనాథ్ పదవులనుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ కేపీఎల్ ప్రాణం పోసుకుంది. -
వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. జవాన్ల ధైర్య, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. సైనికులకు, వారి కుటుంబ సభ్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు భారత జవాన్లకు ఆర్మీడే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. 1948వ సంవత్సరం చిట్టచివరి బ్రిటీష్ కమాండర్ ‘సర్ ఫ్రాన్సిస్ బచ్చర్’ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప జనవరి 15వ తేదీన దేశ సైనికాధికారి బాధ్యతలు స్వీకరించారు. దీంతో విదేశీ సైనిక పాలన నుంచీ దేశానికి విముక్తి లభించినట్లయింది. అందుకు గుర్తుగా ప్రతి ఏటా ‘జనవరి 15న’ ఆర్మీడే జరుపుకొంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. (సైనికుడా.. వందనం) With deep respect, I extend my heartfelt gratitude towards our brave soldiers & their families and salute their courage and valour#ArmyDay pic.twitter.com/dGym8HT4p5 — KTR (@KTRTRS) 15 January 2019 -
కరియప్పకు ‘భారతరత్న’?!
సాక్షి, కొడుగు : ఇండియన్ ఆర్మీ మొదటి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కొడెండెర మాడప్ప కరియప్పకు భారత అత్యున్నత పౌర పుసరస్కారం భారతరత్న కోసం సిఫార్సు చేసినట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. భారతరత్న పురస్కారం అందుకోవడానికి ఆయన అన్ని విధాల అర్హుడని బిపిన్ రావత్ పేర్కొన్నారు. కర్నాటకలోని కొడగు జిల్లాల్లోనే విద్యాభ్యాసం చేసిన కేఎం కరియప్ప తరువాత భారత సైన్యంలో చేరి.. ఆర్మీ చీఫ్‌గా, ఫీల్డ్ మార్షల్‌గా పనిచేశారని ఆయన చెప్పారు. శనివారం కొడుగులొ పర్యటించిన రావత్.. ఫీల్డ్ మార్షల్ కరియప్ప, ‘పద్మభూషణ్’ కొడెండొర సుబ్బయ్యల విగ్రహాలను ఆవిష్కరించారు. ‘‘భారతరత్న పురస్కారానికి కరియప్ప అనర్హుడు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా మనకు కనిపించదు.. ఎందరినో ఆ పురస్కారంతో గౌరవించారు.. దేశానికి, సైన్యానికి దిశానిర్దేశం చేసిన కరిపయప్పను కూడా ఆ పురస్కారంతో గౌరవించాలి’’ అని బిపిన్ రావత్ ప్రభుత్వాన్ని కోరారు. దటీస్ కరియప్ప : ఫీల్డ్ మార్షల్‌గా 5స్టార్ ర్యాంకు సాధించిన ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. 1949లో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు. రెండొప్రపంచ యుద్ధంలో లోనూ, 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలోనూ కరియప్ప పాల్గొన్నారని రావత్ గుర్తు చేశారు. 1949లో కరియప్పను ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు, కేఎం కరియప్ప కుమారుడైన కేసీ కరియప్ప ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ మార్షల్‌గా, స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. కేసీ కరియప్ప 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నట్లు రావత్ చెప్పారు. 1993లో కరియప్పన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు
సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు. అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి.