Katrina Kaif Vicky Kaushal Wedding This News Paper Cutting Is Fast Going Viral at the Moment Know Why - Sakshi
Sakshi News home page

CDS Bipin Rawat: భారతమాత ముద్దు బిడ్డకు గౌరవవందనం చేయవలసిన సమయమిది

Dec 12 2021 8:13 AM | Updated on Dec 12 2021 10:24 AM

Katrina Kaif Vicky Kaushal Wedding This News Paper Cutting Is Fast Going Viral At The Moment Know Why - Sakshi

ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్‌ పేపర్‌ కంటింగ్‌ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి..

సీడీఎస్‌ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్‌ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 

ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్‌ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు.

చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement