
శ్రీనగర్ : భారత సైన్యం మెరుపు దెబ్బ వేసి పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఫూంఛ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు పాక్ రేంజర్లను మట్టుపెట్టింది. సోమవారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద స్థితితో సంచరిస్తున్న పాక్ సైనికులను గమనించిన సిబ్బంది భారత సైన్యాన్ని అప్రమత్తం చేశారు.
దీంతో జవాన్లు రంగంలోకి దిగగా.. పాక్ సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఇక ప్రతిదాడి భాగంగా భారత సైన్యం వారిని కాల్చిచంపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మరోవైపు యూరి సెక్టార్ వద్ద ఆరుగురు జేషే ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్‌లో ఏరివేసిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్‌కు వాళ్లకు అర్థమయ్యే రీతిలోనే సమాధానమిస్తామని ఆర్మీ డే సందర్భంగా భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment