జైపూర్ : పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్.. తక్షణం వాటిని నిలిపితేనే చర్చల అడుగులు ముందుకు పడతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో నిజంగా మైత్రిని పాకిస్తాన్ కోరుకోవడం లేదని.. అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనం అని ఆయన చెప్పారు. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని థార్ ఎడారిలో సదరన్ కమాండ్ నిర్వహిస్తున్న ‘హమేశా-విజయీ’ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
భారత్‌తో స్నేహాన్నిపాకిస్తాన్ నిజంగా కోరుకుంటే.. తక్షణమే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిలిపేయాలన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం మానుకుంటేనే.. ఇరు దేశాల మధ్య చర్యలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, సరిహద్దుల్లో ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు.. ఏరిపారేస్తున్నాయని చెప్పారు. భద్రతా బలగాలు.. ఉగ్రవాదంపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగిస్తాయని.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
భారత్‌తో తత్సంబంధాలు కావాలకుంటే ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్ నిర్మూలించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment