
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్‌లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు.
(చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ)
Comments
Please login to add a commentAdd a comment