
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన తొలి పర్యటనలో ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన, ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో కలసి సోమవారం ఉదయం ఆయన లేహ్ లోని 14వ, శ్రీనగర్‌లోని 15వ సైనికదళాల ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణరేఖ (ఎల్‌వోసీ) వద్ద భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై సైనిక ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు వివరిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. సియాచిన్ వద్ద గత పదేళ్లలో దేశం 163 మంది సైనికులను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అమరవీరులకు నివాళులు అర్పించారు.