
సాక్షి,న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో లడఖ్‌లో తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులతో శుక్రవారం సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వద్ద క్షేత్రస్ధాయి పరిస్ధితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వారం రోజుల వ్యవధిలో రాజ్‌నాథ్ సింగ్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవడం ఇది రెండవసారి కావడం గమనార్హం. భారత్-చైనాల మధ్య ఇటీవల జరిగిన మేజర్ జనరల్ స్ధాయి సంప్రదింపులపైనా వారు చర్చించారు. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో దళాల మోహరింపు గురించి ఈ భేటీలో రక్షణ మంత్రికి జనరల్ బిపిన్ రావత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment