సీడీఎంలో బిపిన్ రావత్‌తో సైనికుడి కరచాలనం
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు.
సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు (హెచ్‌డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా..
ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్‌నార్ ద్వారా హాజరయ్యేవారు.
ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో..
– కంటోన్మెంట్
చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్‌లో మృతులకు నివాళి
Comments
Please login to add a commentAdd a comment