వీడియోలో ఇర్ఫాన్‌ఖాన్
ముంబై: సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగేందుకు కొందరు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తారు. అందరి దృష్టిలో పడేందుకు వెర్రి వేషాలు వేస్తుంటారు. తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల వరకు చేరింది. దీంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్ (28) ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పీఖాన్ అనే పేరిట ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలు ఉన్నాయి. అతడికి 44 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరింత మందిని పెంచుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో రూపొందించాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేసిందని.. ఇది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెబుతూ ఖార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై కూర్చున్నాడు. ఈ సమయంలో తనకు రైలు ఢీకొట్టినట్లు వచ్చేలా ఎడిట్ చేశాడు.
ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బాంద్రా పోలీసులు ఇర్ఫాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకోకూడదని ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు ఆ వీడియో రూపొందించినట్లు పోలీసులకు ఇర్ఫాన్ తెలిపాడు. దీనిపై అతడు క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఏది ఏమైనా అతడిపై పోలీసులు కేసు మాత్రం తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment