సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని షహీన్ బాగ్‌కు ‘మరో సింహం వచ్చింది. దాని పేరు ఇర్ఫార్ పఠాన్’ అంటూ 13 సెకన్ల ఓ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా పలు ఫేస్‌బుక్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 78 వేల వ్యూస్, 3,100 షేర్స్, 666 లైక్స్ వచ్చాయి. ఆ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో ఇర్ఫాన్ పక్కన కూర్చున్న వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిశ్రా అని సులభంగానే గుర్తించవచ్చు. ఇర్ఫాన్ పఠాన్ ఫేస్‌బుక్, ట్విటర్‌ను తనిఖీ చేయగా జనవరి 14వ తేదీన ఆయన ఇదే వీడియోను పోస్ట్ చేశారు. అదే రోజున మదన్ మిశ్రా తాను ఇర్ఫాన్ పఠాన్‌తో ఉన్న ఫొటోను ట్విటర్‌లో విడుదల చేశారు.
ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్ చేసిన వీడియో, ట్విటర్‌లో మదన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను పరిశీలించగా, జనవరి 14వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని కమర్‌హటిలో కమర్‌హటి డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీమియర్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య అతిథిగా హాజరైన వీడియో అది. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైన అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఓడించాలని చూస్తున్న శక్తులు ఈ వీడియోను వక్రీకరించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment