Irfan Patan
-
రెస్ట్ తీసుకుంటే ఫామ్‌లోకి రారు.. కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు
Irfan Pathan: జులై 22 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్‌కు (వన్డేలు) టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. సెలెక్టర్లు తరుచూ సీనియర్లకు విశ్రాంతినివ్వడంపై ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. అసలే ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న కోహ్లి, రోహిత్‌లను విండీస్‌తో వన్డేలకు పక్కకు పెట్టడం ఎంత వరకు సబబని పరోక్షంగా ప్రశ్నించాడు. రెస్ట్ తీసుకుంటే ఏ ఆటగాడూ ఫామ్‌లోని రాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. No one comes back to form while resting… — Irfan Pathan (@IrfanPathan) July 6, 2022 ఇర్ఫాన్ తన ట్వీట్లో కోహ్లి, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించనప్పటికీ నెటిజన్లకు విషయం అర్ధమై సదరు ట్వీట్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో ఇర్ఫాన్ వాదన కరెక్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో ఇర్ఫాన్ ట్వీట్‌కు మద్దతుగా భారీ ప్రచారం చేస్తున్నారు. ఇర్ఫాన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, విండీస్‌తో మూడు వన్డేల కోసం 16 మంది సభ్యుల టీమిండియాను సెలెక్టర్లు నిన్న (జులై 6) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే, సిరీస్‌కు ఓ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడంపై కూడా టీమిండియా అభిమానులు, విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.సెలెక్టర్లు తరుచూ కెప్టెన్లను మారుస్తూ టీమిండియాను సర్వనాశనం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో సెలెక్టర్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకే నెలలో ఒకే జట్టుకు నలుగురు కెప్టెన్లు ఏంటని నిలదీస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు రోహిత్ శర్మకు గాయం కావడంతో బుమ్రా సారధ్య బాధ్యతలు చేపట్టగా, కౌంటీ జట్లతో వార్మప్ మ్యాచ్‌లకు దినేశ్ కార్తీక్, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ, ఆతర్వాత విండీస్‌తో వన్డేలకు ధవన్ టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అంతకుముందు ఐర్లాండ్‌తో టీ20లకు హార్ధిక్ పాండ్య, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్, సౌతాఫ్రికాలో సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారధులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధవన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ చదవండి: బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర -
ధోనికి ఇచ్చే గౌరవం ఇదేనా: అఫ్రిది
ఢిల్లీ: ధోని కూతురు జీవాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'ధోని, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతడు భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయిని తీసుకెళ్లాడు. తన జర్నీలో సీనియర్స్, జూనియర్స్ ఆటగాళ్లను కలుపుకొని ముందుకు వెళ్లాడు. ధోని పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గౌరవం అనిపించుకోదు' అని షాహిద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు. ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోతే కుటుంబ సభ్యులను విమర్శించడం ఏంటని మండిపడ్డాడు. Shahid Afridi "I don't know what sort of threats were directed at MS Dhoni & his family but it's not right & shouldn't happen. Dhoni's the person who has taken Indian cricket to new heights. He's taken junior & senior players along this journey & doesn't deserve such treatment" — Saj Sadiq (@Saj_PakPassion) October 11, 2020 కోలకతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపొయిన విషయం తెలిసిందే. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: జీవాపై కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్) -
వైరల్: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్ ట్వీట్
దుబాయ్ : జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్లు పోటీపడిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేయలేక చెన్నై టీం సతమతమయ్యింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చివరి రెండు ఓవర్లలలో చాలా ఇబ్బంది పడ్డారు. మధ్యమధ్యలో ఆగుతూ బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికి ధోని తన టీంను గెలిపించలేకపోయాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ధోనిపై అతనిపేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. నిన్న రాత్రి ధోని ఆట తీరు చూసే ఇర్ఫాన్ ఇలా ట్వీట్ చేశాడని చాలా మంది భావిస్తున్నారు. Age is just a number for some and for others a reason to be dropped... — Irfan Pathan (@IrfanPathan) October 3, 2020 ‘వయసు అనేది కొందరికి నంబర్ మాత్రమే, అదే కొందరు తప్పుకోవడానికి కారణమవుతుంది’ అంటూ ఇర్ఫాన్ ట్వీట్ చేశారు. ఇక ఐపీఎల్లో ధోని ఆట తీరు చూసిన వారు ఆయన ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 జూలై తరువాత ధోని ఇప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు. ఇక వాతావరణం సరిపడకే తాను ఇబ్బంది పడ్డను అని అంతకు మించి ఏం లేదని, తన అభిమానులు ఎవరు కంగారుపడొద్దని ధోని చెప్పారు. చదవండి: అప్పుడు ట్రోల్ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా! -
జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కన్నుమూశారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. ఐపీఎల్-13 సీజన్లో భాగంగా ముంబైలో ఉండి బ్రాడ్‌కాస్టింగ్ కామెంటరీ అందిస్తున్న జోన్స్.. ఈ రోజు(గురువారం) మధ్యాహ్న ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గుండె పోటుకు గురైన జోన్స్ మృతి చెందడంపై క్రీడాలోకం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్‌లతో పాటు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌లు జోన్స్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు తమ ట్వీట్ల ద్వారా సానుభూతి తెలిపారు.(చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..) ఉదయం బానే ఉన్నారు..: ఇర్ఫాన్ ‘జోన్స్ లేరనే వార్త షాక్‌కు గురి చేసింది. చాలా కలత చెందా. ఆయన ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. నేను రెండు రోజుల క్రితం జోన్స్ కుమారుడితో మాట్లాడా. అప్పటికి ఆయనకు ఎటువంటి సమస్య లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. జోన్స్ మృతిచెందారనే వార్తను నమ్మలేకపోతున్నా’ అని ఇర్ఫాన్ సంతాపం వ్యక్తం చేశాడు. షాక్‌కు గురయ్యా..: కోహ్లి ‘జోన్స్ చనిపోయారనే వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం’ అని కోహ్లి తన ట్వీట్లో సంతాపం తెలిపాడు. మిమ్మల్ని మిస్సవుతున్నాం..: వార్నర్ ‘ఈ వార్తను నమ్మలేకపోయా. చాలా బాధాకరం. జోన్స్ ఆత్మకు శాంతి చేకూరాలి. డీయోనో.. నిన్ను మిస్సవుతున్నాం’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. అతని కామెంటరీని ఎంజాయ్ చేసేవాళ్లం: కైఫ్ ‘జోన్స్ కామెంటరీనీ ఎంజాయ్ చేసేవాళ్లం. మీ అసాధారణ బ్యాటింగ్, ప్రొఫెషనల్ అనాలిసిస్ ఎప్పుడూ అద్భుతమే. మిమ్మల్ని టీవీలో చూసే అవకాశాన్ని మిస్సవుత్నున్నాం. మీతో కలిసి క్రికెట్ విశ్లేషణ ఇక ఉండదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం’ అని కైఫ్ పేర్కొన్నాడు. -
ఇర్ఫాన్ పఠాన్‌పై ఫేక్ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని షహీన్ బాగ్‌కు ‘మరో సింహం వచ్చింది. దాని పేరు ఇర్ఫార్ పఠాన్’ అంటూ 13 సెకన్ల ఓ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా పలు ఫేస్బుక్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 78 వేల వ్యూస్, 3,100 షేర్స్, 666 లైక్స్ వచ్చాయి. ఆ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో ఇర్ఫాన్ పక్కన కూర్చున్న వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిశ్రా అని సులభంగానే గుర్తించవచ్చు. ఇర్ఫాన్ పఠాన్ ఫేస్బుక్, ట్విటర్‌ను తనిఖీ చేయగా జనవరి 14వ తేదీన ఆయన ఇదే వీడియోను పోస్ట్ చేశారు. అదే రోజున మదన్ మిశ్రా తాను ఇర్ఫాన్ పఠాన్‌తో ఉన్న ఫొటోను ట్విటర్లో విడుదల చేశారు. ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్ చేసిన వీడియో, ట్విటర్లో మదన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను పరిశీలించగా, జనవరి 14వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని కమర్హటిలో కమర్హటి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీమియర్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య అతిథిగా హాజరైన వీడియో అది. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైన అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఓడించాలని చూస్తున్న శక్తులు ఈ వీడియోను వక్రీకరించినట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్ ఎంతో ఎదిగింది!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇకపై సరదా టోర్నీగా మాత్రమే చూడరాదని... ఇన్నేళ్లలో ఈ లీగ్ స్థాయి ఎంతో పెరిగిందని పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో బలమైన పోటీ, ఆటగాళ్ల ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి దృష్టి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ వేలంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపించిందని పఠాన్ అన్నాడు. ‘నేను 2008లో తొలి ఐపీఎల్ ఆడినప్పుడు దానిని దాదాపుగా అందరూ కేవలం వినోదంగా మాత్రమే చూశారు. గత కొన్నేళ్లుగా లీగ్ ప్రతీ సంవత్సరం మరింతగా ఎదిగిపోతోంది. ఇప్పుడు పది సీజన్లు ముగిశాక తిరుగులేని స్థితిలో, ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలలో ఒకటిగా నిలిచింది. ఈసారి వేలంపై అందరి దృష్టి నిలవడమే ఇందుకు ఉదాహరణ. క్రికెటర్లు కూడా తీవ్ర ఒత్తిడి మధ్య ఎలా ఆడాలో నేర్చుకుంటున్నారు. ఆటగాళ్లకు వేలంలో విలువ కట్టడం వల్ల కూడా కచ్చితంగా బాగా ఆడాలనే కసి, పట్టుదల వారికి పెరుగుతాయి. ఇదంతా లీగ్‌ను పెద్ద స్థానంలో నిలబెడుతోంది’ అని ఇర్ఫాన్ విశ్లేషించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించడం వల్ల రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్ ప్రదర్శన ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోందని అతను పేర్కొన్నాడు. మరోవైపు లీగ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు పఠాన్ మరో సూచన చేశాడు. న్యూజిలాండ్‌లో ఉన్న తరహాలో మైదానంలో ప్రేక్షకులు క్యాచ్ పట్టే అవకాశం ఇచ్చి బహుమతులతో ప్రోత్సహించాలని అన్నాడు. జమ్మూ కశ్మీర్ తరఫున... 2018 ఐపీఎల్ వేలంలో ఇర్ఫాన్‌ను ఏ జట్టు కూడా తీసుకోలేదు. అయితే దీనికి తాను బాధ పడటం లేదని, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏమాత్రం రాణించకపోవడం వల్లే తనను పట్టించుకోలేదని విషయం తనకు తెలుసని అతను అన్నాడు. వచ్చే దేశవాళీ సీజన్లో ఇర్ఫాన్ పఠాన్ జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సంఘం ప్రతినిధులతో తాను చర్చలు జరిపినట్లు అతను వెల్లడించాడు. ఈ సీజన్లలో ఆడిన 2 రంజీ మ్యాచ్‌లలో కూడా విఫలం కావడంతో ఇర్ఫాన్‌ను బరోడా అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పించింది. కీలక సమయంలో గాయాలతో కెరీర్ ఇబ్బందుల్లో పడిందని, గణాంకాలకంటే కూడా ఒక దశలో అమిత ప్రభావం చూపించిన ఆటగాడిగా భారత క్రికెట్ తనను గుర్తు పెట్టుకుంటుందని ఉద్వేగంగా చెప్పాడు. ఈసారి ఐపీఎల్లో ‘స్టార్ టీవీ’ వ్యాఖ్యాతల బృందంలో చేరే అవకాశం ఉన్న ఇర్ఫాన్... సన్‌రైజర్స్ తరఫున తన సోదరుడు యూసుఫ్ పఠాన్ బాగా ఆడతాడనే విశ్వాసం వ్యక్తం చేశాడు. -
అక్టోబర్ 27 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: దిలీప్ (నటుడు), ఇర్ఫాన్ పటాన్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజ సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది, 9 సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కోర్టుకేసులలో విజయం కలుగడం లేదా మానసిక వ్యధకు గురి చేస్తున్న కేసుల నుండి ఊరట లభిస్తుంది. విద్యార్థులు తమలోని శక్తిసామర్థ్యాలను, తెలివితేటలను బాగా ఉపయోగించుకుని మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పుట్టిన తేదీ 27. ఇది కూడా కుజ సంఖ్యే కాబట్టి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో, సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. మైన్స్‌కు సంబంధించిన వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,2,5,6,7,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు. సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం, చేయించటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం, ప్రేమవ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్