అక్టోబర్ 27 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: దిలీప్ (నటుడు), ఇర్ఫాన్ పటాన్ (క్రికెటర్)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజ సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది, 9 సంపూర్ణతకి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కోర్టుకేసులలో విజయం కలుగడం లేదా మానసిక వ్యధకు గురి చేస్తున్న కేసుల నుండి ఊరట లభిస్తుంది. విద్యార్థులు తమలోని శక్తిసామర్థ్యాలను, తెలివితేటలను బాగా ఉపయోగించుకుని మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పుట్టిన తేదీ 27. ఇది కూడా కుజ సంఖ్యే కాబట్టి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు.
కొత్త కొత్త ఆలోచనలతో, సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. మైన్స్‌కు సంబంధించిన వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,2,5,6,7,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు. సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం, చేయించటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం, ప్రేమవ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్