దుబాయ్ : జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్లు పోటీపడిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేయలేక చెన్నై టీం సతమతమయ్యింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చివరి రెండు ఓవర్లలలో చాలా ఇబ్బంది పడ్డారు. మధ్యమధ్యలో ఆగుతూ బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికి ధోని తన టీంను గెలిపించలేకపోయాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ధోనిపై అతనిపేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. నిన్న రాత్రి ధోని ఆట తీరు చూసే ఇర్ఫాన్ ఇలా ట్వీట్ చేశాడని చాలా మంది భావిస్తున్నారు.
Age is just a number for some and for others a reason to be dropped...
— Irfan Pathan (@IrfanPathan) October 3, 2020
‘వయసు అనేది కొందరికి నంబర్ మాత్రమే, అదే కొందరు తప్పుకోవడానికి కారణమవుతుంది’ అంటూ ఇర్ఫాన్ ట్వీట్ చేశారు. ఇక ఐపీఎల్‌లో ధోని ఆట తీరు చూసిన వారు ఆయన ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 జూలై తరువాత ధోని ఇప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు. ఇక వాతావరణం సరిపడకే తాను ఇబ్బంది పడ్డను అని అంతకు మించి ఏం లేదని, తన అభిమానులు ఎవరు కంగారుపడొద్దని ధోని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment