‘పాకిస్థాన్‌లో నేడు హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరాలకు తార్కానం ఈ వీడియో. ఓ హిందూ యువతిని ఆమె కన్న తల్లి ముందే బలవంతంగా ఇద్దరు ముస్లిం యువకులు ఎత్తుకు పోయారు. అడ్డు వచ్చిన తల్లిని చితకబాదారు. ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తున్న ప్రజలు కళ్లు తెరవాలి. పాకిస్తాన్‌లో 1951లో అక్కడి జనాభాలో హిందువులు 12.9 శాతం ఉండగా, నేడు 1.6 శాతం మాత్రమే ఉన్నారు’ అన్న వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది.