
ఇది టెక్నాలజీ యుగం. సాంకేతిక అభివృద్ధి కారణంగా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఊహించని పనులు జరుగున్నాయి. అదే సమయంలో కత్తికి రెండు వైపుల పదును అన్నట్లుగా.. ఇదే టెక్నాలజీ కొన్ని తప్పుడు పనులు కూడా చేయిస్తుంది. కొంతమంది ఏఐ సహాయంతో నకీలీ ఫోటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరవును బజారున పడేస్తున్నారు.
మార్ఫింగ్ టెక్నాలజీ సినీ హీరోయిన్లను ఇబ్బందులకు గురి చేస్తుంది. అసభ్యకరమైన వీడియోలకు.. స్టార్ హీరోయిన్ల ముఖాలను మార్ఫింగ్ చేసి..వాటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వీడియోపై చర్చించింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సైతం ఈ ఫేక్ వీడియో పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ చైతన్య)
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నకిలీదో ఏది ఒరిజినలో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ టెక్నాలజీని వాడుకొని గతంలో సమంత, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్, తమన్నా బాటియా లాంటి స్టార్ హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి ఫేక్ వీడియోలు సృష్టించారు. మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమా పోస్టర్‌ని సైతం ఏఐ సహాయంతో సృష్టించి, సోషల్ మీడియలో సర్కులేట్ చేశారు. పలువురు హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలను రూపొందిస్తున్నారు.
(చదవండి: ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి స్టార్ హీరోయిన్ల నగ్న ఫోటోలను సృష్టించి, నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రష్మికలాగే రేపు మరో హీరోయిన్ కూడా ఇలాంటి ఫేక్ వీడియోల బారిన పడొచ్చు. ఈ డిజిటల్ యుగంలో నకిలీ వీడియోలను, ఫోటోలను కట్టడి చేయడం సవాలే అయినా..ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తే కొంతవరకు అయినా తగ్గించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment