ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సైతం డీప్ ఫేక్ బారిన పడింది. టైగర్-3 చిత్రంలోని ఓ సీన్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన దుస్తులు మార్చుకుంటున్నట్లుగా వీడియోను రూపొందించారు. ఇది కూడా డీప్‌ఫేక్ సాయంతోనే ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఉన్నది కాజోల్ కాదని..ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌దని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ బూమ్ వెల్లడించింది. ఈ వీడియో ఈ ఏడాది జూన్ 5న పోస్ట్ చేశారని తెలిపింది. అయితే మనదేశంలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే రష్మిక మందన్నా వీడియో వైరల్ కావడంతో.. ఈ డీప్‌ఫేక్ వీడియో తాజాగా బయటకొచ్చింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో గతంలో టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారని బూమ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ వీడియోనూ ఎవరు సృష్టించారో మాత్రం తెలియరాలేదు. అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment