
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.
ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్‌కు కాజోల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్‌ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్‌గా నియమించడంపై ఏకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment