సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న నెపంతో రూథ్ ఛల్తన్ సౌమి అనే యువతితోపాటు మరో నలుగురిని మిజోరాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువతిని కొంతమంది దుండగులు సామూహిక అత్యారాచం చేసి హత్య చేశారని, ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఒక వీడియో పోస్ట్ చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అది తప్పుడు వీడియోగా ధ్రువీకరించి సంబంధిత వీడియోను పోస్ట్ చేసిన ఛల్తన్ సౌమిని, ఆమె నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ చట్టం సెక్షన్ 66, సెక్షన్ 203 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.