
సాక్షి, ఢిల్లీ: తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. నకిలీ వీడియోపై స్పందించిన ఆయన.. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఈనాడు వండివార్చిన వట్టి మాటల స్టోరీ! అసలు విషయం ఇదే..
కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment