Rashmika Mandanna AI deepfake video టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆన్‌లైన్‌లో అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న మానిప్యులేషన్స్‌కు ఇదొక తీవ్ర హెచ్చరిక లాంటిదంటూ రష్మిక టార్గెట్‌గా వచ్చిన డీప్ ఫేక్ వీడిమోపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర చర్యలు తీసుకోవాలంటూ కవిత సోమవారం ట్వీట్ చేశారు.
అలాగే వీటిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు మరో కేంద్రం రాజీవ్ చంద్రశేఖర్‌కి విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా సుదీర్ఘ ప్రసంగాలు తరువాత కాంక్రీట్ చర్యలు కావాలంటూ కేంద్ర సర్కార్‌పై చురకలు వేశారు. రష్మికాకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫేక్‌వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. ఇలాంటి నకిలీ వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు ప్రముఖులతోపాటు, నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ )
రష్మిక ఆవేదన
అటుఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా రష్మిక తన స్పందన తెలిపారు. డీప్‌ఫేక్ వీడియో విచారం వ్యక్తం చేసిన ఆమె టెక్నాలజీ మిస్ యూజ్ అవుతోందనీ, ఇది తనోపాటు పాటు చాలామందిని బాధపెడుతోందంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందున్నారు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం మరింతగా న్యాయపోరాటం చేసేందుకు కవిత సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఇటీవల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే.
Recent deepfake targeting Actor Rashmika Mandanna exposes the alarming ease of narrative manipulation online. Urgent action is needed to safeguard Indian women from cyber threats.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 6, 2023
I appeal to Hon’ble President @rashtrapatibhvn, Hon’ble PM @narendramodi, Minister of Electronics…
Comments
Please login to add a commentAdd a comment