Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్‌లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్‌లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్)
కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ )
హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment