బాకు: ‘‘లైవ్‌లో ఉన్న సంగతి మర్చిపోయి మరీ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్’’.. ఈ క్యాప్షన్‌తో ఓ వీడియో ఈమధ్య ఫేస్బుక్లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్, టాబ్లాయిడ్స్ అసదోవ్ తీరును తప్పుబడుతూ ఆ వార్తను ప్రచురించేశాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి ఓ ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. అందులో ఉంది ఆయన కాదంటూ అసలు విషయం తెలిసొచ్చింది.
వీడియోలో ఏముందంటే..
జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. అందులో పెద్దాయన సడన్‌గా వెనక్కి తిరుగుతాడు. అక్కడే ఉన్న ఓ మహిళ వెనుక భాగాన్ని తన చేత్తో తాకుతాడు. దీంతో ఉలిక్కి పడ్డ ఆ మహిళ.. ఆయనతో వాగ్వాదానికి దిగుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది. వెంటనే ఆయన కెమెరా ఆఫ్ చేస్తాడు. అయితే కొందరు ఫేస్బుక్ యూజర్లు.. ఇది అజర్ బైజాన్ అధ్యక్షుడి పనే అని, కాదు ప్రధాని అలీ అసదోవ్ పనే అని మరికొందరు ప్రచారం చేశారు చేశారు. జూమ్ మీటింగ్‌కు ఎగ్జిట్ కొట్టని సంగతి మరిచి.. అలా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అయితే అందులో ఉంది అజర్ బైజాన్ అధ్యక్షుడో, ప్రధానో కాదని ఇప్పుడు తేలింది.
పాత వీడియో కానీ..
మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అజర్ బైజాన్ మాజీ ఎంపీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ హుసేయిన్బలా మిరాలమోవ్. పోయిన నెలలో ఆయన ఈ పాడు పనికి పాల్పడ్డాడు. పైగా ఈ వీడియో రిలీజ్ అయ్యి నెలపైనే అయితోంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా, ఆయన్ని న్యూ అజర్ బైజాన్ పార్టీ బహిష్కరించింది కూడా. అయితే ఈ వ్యవహారం అధికారిక జూమ్ మీటింగ్‌లోనే జరగడం విశేషం. ఇక పోలికలు కూడా పట్టించుకోకుండా కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై దావాకు అజర్ బైజాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఇది అసలు విషయం
Comments
Please login to add a commentAdd a comment