సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024
బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్
హైదరాబాద్‌లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్‌ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్‌ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్‌విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment