అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్ | Aamir Khan Files FIR With Mumbai Police Against Fake Video | Sakshi
Sakshi News home page

అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్

Published Tue, Apr 16 2024 2:10 PM | Last Updated on Tue, Apr 16 2024 3:13 PM

Aamir Khan Files FIR With Mumbai Police Against Fake Video - Sakshi

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు.

బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు.

ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు.

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement