సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్‌తో ఎంతో మంది స్టార్లు అయ్యారు. అలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన పాట 'కచ్చా బాదమ్'. ఈ సాంగ్‌కు ఎంతోమంది రీల్ చేసి అదరగొట్టారు. అయితే ఈ పాటపై అంజలి అరోరా చేసిన రీల్ నెట్టింట్లో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. దీంతో అంజలి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్' షోలో పాల్గొంది కూడా. ఈ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాందించుకుంది అంజలి అరోరా. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అంజలి అరోరా ఎమ్‌ఎమ్‌ఎస్ పేరిట ఒక ఫేక్ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఆ వీడియోలో అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం, అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగా అందరు భావిస్తున్నారు. అయితే ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. అది ఎవరు సృష్టించారో? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని ఎమోషనల్ అయింది.
''ఆ వీడియోలో ఉంది నేను కాదు. అసలు నాకు సంబంధం లేని వీడియోకు నా పేరును యాడ్ చేశారు. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ వీడియోలో నా ఫొటో అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. నన్ను ఒకప్పుడు మెచ్చుకున్న ప్రేక్షుకులే ఇప్పుడు తిడుతున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణం. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు'' అని ఎమోషనలై కన్నీరు పెట్టుకుంది అంజలి అరోరా.
Comments
Please login to add a commentAdd a comment