memos issued
-
వార్నింగ్‌తోనే సరి!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ఆర్డర్లీ’పై ఆరా ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం. హెచ్చరించి వదిలేస్తారా? చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది. -
పాత వంట.. కొత్త మంట
మధ్యాహ్న భోజనంలో కొత్తపద్ధ్దతి ► ఐదారు మండలాలకు ఒక వంటశాల ► అక్కడ నుంచే పాఠశాలలకు మధ్యాహ్న భోజనం ► పరిశీలించి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు ► ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకు శ్రీకారం మెమోలు జారీ ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీల నిర్వాహకులు నెల్లూరు (టౌన్) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రసుత్తం పాఠశాలల్లో వంట చేసి భోజనం వడ్డించే విధానానికి చెక్ పెట్టనున్నారు. కేంద్రీకృత మధ్యాహ్న భోజన విధానాని(సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్)కి శ్రీకారం చుట్టనున్నారు. దీనిని 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోసెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ నిర్వహణకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జిల్లాలో 5 ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. 2018–19 విద్యా సంత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్(కేంద్రీయ భోజన వంటశాల) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేంద్రీయ వంటశాలకు 5 అనువైన ప్రాంతాలను గుర్తించాలని డెప్యూటీ ఈఓలు, ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు పంపారు. ప్రస్తుతం వెంకటాచలంతో పాటు పలు పట్టణ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రవిద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు. జిల్లాలో మొత్తం 3,441 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 2,29,434 మంది విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజన నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కొంతమంది వంట ఏజెన్సీ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో రుచి లేకుండా వండి పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్ విధానానికి నాంది పలుకుతోంది. ఒకే వంటశాలలో 22 వేల నుంచి 25వేల మంది వరకు పిల్లలకు సకాలంలో వండి పంపిణీ చేసే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంత సామర్థ్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలని జిల్లా విద్యాశాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కిచెన్ స్టోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలను వాటి పరిధిలోకి చేర్చనున్నారు. ఐదారు మండలాలకు ఒకటి జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి ఐదారు మండలాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అ వంటశాల నిర్వహణకు రెండు ఎకరాల వీస్తీర్ణం కలిగి ఉండాలని నిర్ణయించారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉండే పాఠశాలలు ఈ వంటశాల పరిధిలోకి వచ్చే విధంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. వంటశాలలో భోజనం, కూరలు వండి ఆయా పాఠశాలలకు వాహనాల్లో తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ విధానంలో పెద్దగా లోపాలు లేకపోవడం, నాణ్యత కలిగి ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళల ఆగ్రహం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇతరులకు అప్పజెప్పడంపై డ్వాక్రా మహిళలు, ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులు మండిపడుతున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గతనెల 19న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 3వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. వీరిలో 90శాతానికి పైగా డ్వాక్రా మహిళలే. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అనేకమంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆరేడు నెలల నుంచి బిల్లులను నిలిపివేసినా కొంతమంది ముందుగానే పెట్టుబడులు పెట్టి భోజనం వడ్డిస్తున్న సందర్భాలున్నాయి. మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అర్ధంతరంగా ఒకే కేంద్రీయ వంటశాల విధానం అమలు చేస్తే దీని మీద బతుకుతున్న వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతారని చెబుతున్నారు. నిర్ణయం ఉపసంహరించుకోవాలి మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అకస్మాత్తుగా సెంట్రలైజ్డ్ కిచెన్ స్టోర్స్‌ను తెస్తే వీరంతా ఎటుపోవాలి? మహిళా సాధికారిత కోసం ఇసుక, డ్వాక్రా రుణాలు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు తర్వాత పట్టించుకోలేదు. తాజా నిర్ణయంతో మధ్యాహ్న భోజనం వడ్డించి ఉపాధి పొందుతున్న మహిళలు అన్యాయమైపోతారు. దీనిమీద ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను కలిసి ఉద్యమ బాట పడతాం. – రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షురాలు ప్రతిపాదనలు పంపమన్నారు సెంట్రలైజ్డ్ మిడ్డే మీల్స్ సిస్టమ్ అమలుకు తగు ప్రాంతాలు గుర్తించి ప్రతిపాదనలు పంపమని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ఐదు ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో గుర్తించిన ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం అత్యున్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నాం. ఈ ఏడాది నుంచి కొత్త విధానం ప్రారంభమవుతుంది. – రామలింగం, డీఈఓ -
నిరంకుశత్వానికి పరాకాష్ట
- 77 మంది ఉద్యోగులకు మెమోలు జారీ - వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై కక్షసాధింపు ఎస్కేయూ: వర్సిటీలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయి. శాంతియుతంగా బంద్ నిర్వహించిన వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై చర్యలు చేపట్టారు. బంద్ విషయం తెలియని 77 మంది ఉద్యోగులకు శనివారం ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ మెమోలు జారీ చేశారు. సోమవారం లోపు వివరణ ఇవ్వాలని కోరారు. ముగ్గురిపై సస్పెన్షన్ –నలుగురిపై కేసు నమోదు శుక్రవారం వర్సిటీలో బంద్ నిర్వహించారని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహా రెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను సస్పెన్షన్ చేయాలని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ ప్రిన్సిపాల్ ఆచార్య కష్ణానాయక్కు సిఫార్సు చేశారు. వీరితో పాటు విద్యార్థి నాయకుడు బీవీ లింగారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఇటుకపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ అంశాన్ని సోమవారం పరిశీలిస్తామని క్యాంపస్ కళాశాల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కష్ణానాయక్ అన్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం వీసీ ఆచార్య కే.రాజగోపాల్ వర్సిటీలో లేనప్పటికీ వీసీ లిఖితపూర్వక ఆదేశాలతో మెమోలు ఇస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ నోటీసులు ఇవ్వడం కొసమెరుపు. ఏమి జరిగిందంటే.. రెండో పీజీ చదువుతున్నప్పటికీ , వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడికి హాస్టల్ సదుపాయం ఎలా కల్పిస్తారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వర్సిటీ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి మొదటి పీజీ పేమెంట్ సీటు, రెండో పీజీ రెగ్యులర్ పీజీ కావడంతో హాస్టల్ సదుపాయం అర్హతగా ఉన్నప్పటికీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా హాస్టల్ నుంచి తొలగించారని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ బదిలీ సర్టిఫికెట్తో అడ్మిషన్లు పొందిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిపై కూడా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శుక్రవారం పాలకభవనంలో బంద్ నిర్వహించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం అంటే వేటే.. వర్సిటీలో అధికారులు వైఎస్సార్ విద్యార్థి విభాగంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌లు నిర్వహించారు. ఎస్కేయూ వీసీ పీఏపై పాశవికంగా దాడి, ఓ వార్డెన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. సీసీ కెమెరాల సాక్షిగా ఇవన్నీ రికార్డు అయ్యాయి. అయినా ఆ విద్యార్థి సంఘం నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై మాత్రమే కేసులు నమోదు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.