vr
-
వార్నింగ్‌తోనే సరి!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ఆర్డర్లీ’పై ఆరా ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం. హెచ్చరించి వదిలేస్తారా? చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది. -
అవినీతి కానిస్టేబుల్స్‌పై వేటు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లపై వేటు పడింది. పలు ఆరోపణలు రావడంతో కానిస్టేబుల్ సురేష్, హెడ్ కానిస్టేబుల్ భూపాల్‌రెడ్డిలను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరువురికి మట్కా, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందాయని తెలిసింది. ఇటీవల పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సురేష్, భూపాల్‌రెడ్డిలు డబ్బు ఇవ్వాలని తరచూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కూడా అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంతేగాక ఓ మట్కా బీటర్‌తో సంబంధాలు పెట్టుకొని ఆర్థికంగా బాగా లబ్దిపొందినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడుల నేపథ్యంలో మట్కా బీటర్కు వీరు ముందస్తు సమాచారం ఇచ్చేవారని విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదులను కొద్దిరోజులుగా పరీశిలిస్తున్న జిల్లా ఎస్పీ.. సురేష్, భూపాల్‌రెడ్డిలను వీఆర్‌కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు వెంటనే వీఆర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో తదుపరి చర్యలు కూడా ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్‌టౌన్ పీఎస్‌లో ఒకేసారి ఇద్దరిపై వేటు పడటంతో సిబ్బంది వెన్నులో వణుకుపుడుతోంది. -
గంజాయి వ్యవహారంలో వీఆర్‌కు సీఐ?
ఉన్నతాధికారుల అదుపులో కానిస్టేబుల్? మారేడుమిల్లి : గంజాయి అక్రమ రవాణాకు సహకరించినందుకు మారేడుమిల్లి సీఐను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. అలాగే ఓ కానిస్టేబుల్‌ను కూడా ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల పోలీసుల పాత్ర కూడా కీలకంగా ఉందని, స్మగర్లకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక స్టేష¯ŒSకు చెందిన సీఐను వీఆర్‌కు పంపి, ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా కొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని, ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతా«ధికారులు ఎవరూ పూర్తిగా ధ్రువీకరించలేదు. గతంలో కూడా గంజాయి కేసులో ఇదే స్టేష¯ŒSకు చెందిన ఓ సీఐని కూడా వీఆర్‌కు పంపడం గమనార్హం -
ఎమ్మిగనూరు ఎస్ఐ శంకరయ్యపై వేటు
–అవినీతి ఆరోపణలతో వీఆర్‌కు –ఎస్ఐ,కానిస్టేబుల్‌పై కేసు నమోదు ఎమ్మిగనూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ శంకరయ్యపై ఎట్టకేలకు వేటు పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఎస్ఐను జిల్లా ఎస్పీ రవికష్ణ వీఆర్‌కు ఆదేశించారు. ఓ కేసు విషయంలో ఎమ్మిగనూరుకు చెందిన వడ్డీవ్యాపారి రాజేష్‌గౌడ్‌కు అనుకూలంగా రిపోర్టురాసేందుకు ఎస్ఐ శంకరయ్య మొదట రూ.3లక్షలు,తరువాత 2లక్షలు చొప్పున చివరకు రూ.65వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణ. ఏసీబీ అధికారుల ట్రాప్మేరకే రాజేష్‌గౌడు ఇలా చేస్తున్నాడని ఎసై ్స భావించాడు. దీంతో తనను రివాల్వర్‌తో బెదిరించినట్లు రాజేష్‌గౌడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే తుంగభద్ర పుష్కరాలు,సీఎం పర్యటన, వినాయక నిమజ్జనాలు ఉండటంతో ఎసై ్సపై చర్యలు ఆలస్యమయ్యాయి. ఎమ్మిగనూరుకు చెందిన ప్రధాన ప్రజాప్రతినిధి హోంమంత్రితో చెప్పించానని, ఇక చర్యలుండవని అభయమిచ్చాడు. రెండురోజుల క్రితం జరిగిన బదిల్లో ఎసై ్స పేరులేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఊహించని రీతిలో ఆదివారం వీఆర్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎమ్మిగనూరు రూరల్ ఎసై ్సకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రాజకీయ పైరవీలు,ఆర్థిక లావాదేవీల్లేవి ఎస్ఐ శంకరయ్యను రక్షించలేకపోయాయని పోలీస్‌శాఖలో చర్చ. ఎస్ఐపై కేసు నమోదు: తనను రివాల్వర్‌తో చంపుతానని బెదిరించాడనీ వడ్డీ వ్యాపారి రాజేష్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణ ఎసై ్స శంకరయ్య, కానిస్టేబుల్ రవిపై అండర్ 384,506,రెడ్‌విత్ 511ఐపీసీ,రెడ్‌విత్ 34ఐపీసీ అండర్ సెక్షన్ 156 క్లాస్3 సీఆర్పీసీ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నాగేశ్వరరావు తెలిపారు. -
ఎస్సైపై దాడి ఘటనలో ఆటో డ్రైవర్ అరెస్టు
హైదరాబాద్: భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రసాదరావుపై దాడి ఘటనలో నిందితుడు సయ్యద్ బిన్ మహమ్మద్ ను అరెస్టు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడిపై సెక్షన్లు 305, 306ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విధుల్లో ఉదాసీనతగా ఉన్నందుకు ఎస్ఐ ప్రసాదరావును, ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ లను వీఆర్ కు పంపుతున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు అవరోధం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించమని తెలిపారు. ఈ ఘటనలో అడిషనల్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డికి చార్జ్ మెమో ఇచ్చినట్లు వివరించారు. -
పెండింగ్‌లో ఎస్సైల బదిలీలు ?
నిజామాబాద్ క్రైం: జిల్లాలో ఎస్సైల బదిలీలు నిలిచిపోయినట్లు సమాచారం. ఎస్సై బదిలీలు జరిగిన 24 గంటలోపు దీనికి సంబంధించి ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వుల అమలు పెండింగ్‌లో ఉంచటం వెనుక జిల్లాకు చెందిన కొంతమంది నేతల జోక్యం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన బదిలీలలో 11 మంది ఎస్హెచ్ఓలను మరో చోటుకు బదిలీ చేయకుండా వీఆర్‌లోకి పంపటమే ఈ బదిలీ ఉత్తర్వులు నిలిచిపోవటానికి కారణమని తెలుస్తోంది. దానికి తోడు నేతలు తమకు తెలియకుండా బదిలీలు చేయటంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తమకు మాట వరుసకైన చెప్పకుండా ఎస్హెచ్ఓ, ఎస్సైల బదిలీలు ఎలా చేస్తారని రేంజ్ కార్యాలయం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో బదిలీల ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టించిన నేతలు మరోసారి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లటంతో బదిలీల ఉత్తర్వులు నిలిచిపోవటంపై స్పష్టత రాలేదు. గురువారం రాత్రి జరిగిన బదిలీలలో కొంతమంది ఎస్హెచ్ఓలు జిల్లాలో ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నుల పనిచేస్తున్నరనే విషయాన్ని ఎస్పీ గుర్తించారు. వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని వారికి బదిలీలలో మరోక స్టేషన్ అప్పగించకుండా వీఆర్‌లోకి పంపారు. బదిలీ అయిన కొంతమంది ఎస్హెచ్ఓలపై పలు అవినీతి ఆరోపణలు రావటంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ తాను జిల్లాకు వచ్చిన మొదటి రోజే ఎస్సైలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎటువంటి విషయాలలో జోక్యం చేసుకోరాదు, శాఖకు మచ్చ తీసుకువస్తే సహించేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయిన నేతల ప్రసన్నం ఉన్న వారు తమను నేతలను కాపాడుతారని వారి పంధాను కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి వారిపై ఎస్పీ మరింత దృష్టి సారించారు. దాంతో కొంతమంది ఎస్హెచ్ఓలు రాత్రికి రాత్రే ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన నేతలు బదిలీల ఉత్తర్వులు అమలు జరుగకుండా పెండింగ్‌లో పెట్టించినట్లు తెలిసింది. గతంలో 2014లో సాధరణ ఎన్నికల అనంతరం అప్పటి ఎస్పీ తరుణ్ జోషీ జిల్లాలో భారీ ఎత్తున ఎస్సైలను బదిలీలు చేశారు. ప్రజాప్రతినిధులు తాము సూచించిన ఎస్సైలను కాకుండా ఎస్పీ తన ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేయటంపై ప్రముకుమ్మడిగా సీఎం వద్దకు వెళ్లి 24 గంటల లోపే బదిలీలు రద్దు చేయించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు కూడ బదిలీల ఉత్తర్వులు నిలిపివేయించి మరోసారి తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లు అయ్యింది. జిల్లాలో మంచి ఆదాయం గల పోలీస్స్టేషన్లుగా పేరున్న స్టేషన్ల ఎస్సైలు ఉన్న ఫలంగా తమను వీఆర్‌లోకి పంపటంపై తాము డబ్బులు పెట్టి కొరుకున్న స్టేషన్ల నుంచి పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించక ముందే బదిలీలు కావటంతో నేతలను ఆశ్రయించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిలిచిపోయిన ఉత్తర్వులు అమలు అవుతాయా లేదా, వీఆర్‌లోకి వెళ్లిన వారికి మరోక పోలీస్స్టేషన్లు అప్పగిస్తారా వేచి చూడాలి. S -
ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల పట్ల పెరుగుతున్న మోజును దృష్టిలో పెట్టుకొని ఇందులో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది ఫేస్బుక్. ప్రస్తుతం మనకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన వారితో సెల్ఫీ తీసుకోవాలంటే నచ్చిన వారిని తీసుకొని ఆ నచ్చిన ప్రాంతానికి భౌతికంగా వెళ్లాల్సిందే. ఇకముందు అలాంటి అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీ దిగవచ్చు. నచ్చిన వారు కూడా మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్కనే ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఉదాహరణకు భారత్‌లో ఒకరుండి, లండన్‌లో ఒకరుండి, ఇద్దరు కలసి అమెరికాలో ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఫేస్బుక్ ఇటీవలనే మార్కెట్లోకి విడుదల చేసిన వర్చువల్ రియాలిటీ యాప్, హెడ్‌సెట్‌ను ఉపయోగించి ఇలాంటి సెల్ఫీలను సాధించవచ్చని ఫేస్బుక్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన వార్షిక సమావేశ వేదికపై ప్రదర్శించి చూపింది. అందులో ఇద్దరు వీఆర్ హెడ్ సెట్ కలిగిన వారు సిలికాన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉండి, లండన్ వంతెనపై ఉన్నట్లుగా సెల్ఫీ దిగారు. అయితే ఆ ఛాయా చిత్రం మాత్రం ఆర్టిస్ట్ వేసిన రేఖా చిత్రంగానే కనిపించింది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఇది భవిష్యత్ రియాలిటీకి నేడు పునాది వేయడమేనని ఫేస్బుక్ డెవలపర్ వివరించారు. వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం ఎలా సాధ్యమైందో, అలాగే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు వీడియో కాల్‌ను లింక్ చేయడం ద్వారా అసలైన చిత్రాల్లాగా సెల్ఫీలు ఉండేలా చేయవచ్చని చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. -
హోటల్ నుంచి ‘మధ్యాహ్న భోజనం’
రాజాంరూరల్ : ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల కు ఉచి తంగా పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సదాశయానికి గండిపడుతోం ది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మండ ల పరిధిలోని వీఆర్ అగ్రహారం ఎస్సీ కాల నీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హోట ల్ నుంచి తెప్పిస్తున్నారు. మూడేళ్లుగా వం ట ఏజెన్సీల మధ్య వివాదం చెలరేగుతోం ది. రాజ కీయ కక్షల నడుమ పథకాన్ని భ్రష్టుపట్టించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వర్గం ఒకటైతే, అధికార పార్టీ వర్గం మరొక గ్రూపుగా తయారయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోన్న సంఘాన్ని వంటలు బాగోలేదంటూ మూ డేళ్ల క్రితం వివాదం రేపి విద్యార్థులు భోజ నం చేయకుండా నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక హెచ్ఎం కె.జయ ఇరువర్గాలను శాంతపరిచి ఆరు నెలలు పాటు ఒక్కో వర్గం మధ్యాహ్న పథకంలో వంట చేయాల ని సూచించారు. ఆ ఏడాది రెండు వర్గాలు ఒప్పుకుని వంట చేశాయి. గత ఏడాది మరోమారు ఈ వివాదం చెలరేగడంతో మండల స్థాయి అధికారులంతా గుమిగూ డి మూడేసి నెలల చొప్పున ఒక్కో వర్గం వంట చేయాలని తీర్పు చెప్పడంతో వివా దం సద్దు మణిగింది. ఈ ఏడాది మళ్లీ వివా దం చెలరేగింది. అధికార పార్టీ వర్గం వంట చేస్తే విద్యార్థులు భోజనాలు చేయరని, అవసరమైతే స్కూల్‌కి పిల్లలను పం పించమని ప్రత్యర్థి వర్గం తెగేసి చెప్పింది. దీంతో వం ట ఆగి పోయింది. అయితే ఎంఈవో జి. మంజుల ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి పాఠశాల హెచ్ఎం తన సొంత నిధులతో రోజుకి రూ.240 చొ ప్పున వెచ్చించి రాజాంలోని హోటల్ నుంచి భోజనాళ్ల పార్శిల్ తెప్పించి విధ్యార్థులకు పెడుతున్నా రు. ఇంకెన్నాళ్లు ఇలా పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.4.35 మంజూరు చేస్తోందని, పాఠశాలలో 19 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరందరికీ కలిపి భోజనం వడ్డిస్తే ప్రభుత్వం రూ 82.65 మంజూరు చేస్తుందని, ఖర్చు మాత్రం రూ.240 అవుతోందని హెచ్ఎం అన్నారు. విద్యార్థులకు కూడా అరకొరగా భోజనం అందుతోంది. దీంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి పాఠశాలలో సక్రమంగా మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. హోటల్ నుంచి తెప్పించడం భారమే రోజూ హోటళ్ల నుంచి సొంత నిధులతో భోజనాలు తెప్పించలేక ఇబ్బంది పడుతున్నాం. వంట ఏజెన్సీలు మా మాట వినటం లేదు. ఉన్నతాధికారులే పరిష్కరించాలి. కె.జయ, హెచ్ఎం. ఆకలి తీరడం లేదు హోటళ్ల నుంచి తెస్తున్న పార్శిల్ భోజనం అందరికీ సరిపోవడం లేదు. సాయంత్రం వరకూ అర్ధాకలితోనే అలమటిస్తున్నాం. -షేక్ ఆయుష, 5వ తరగతి,