ఎమ్మిగనూరు ఎస్‌ఐ శంకరయ్యపై వేటు
ఎమ్మిగనూరు ఎస్‌ఐ శంకరయ్యపై వేటు
Published Sun, Sep 18 2016 9:44 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
–అవినీతి ఆరోపణలతో వీఆర్‌కు
–ఎస్‌ఐ,కానిస్టేబుల్‌పై కేసు నమోదు
ఎమ్మిగనూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మిగనూరు పట్టణ ఎస్‌ఐ శంకరయ్యపై ఎట్టకేలకు వేటు పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఎస్‌ఐను జిల్లా ఎస్పీ రవికష్ణ వీఆర్‌కు ఆదేశించారు. ఓ కేసు విషయంలో ఎమ్మిగనూరుకు చెందిన వడ్డీవ్యాపారి రాజేష్‌గౌడ్‌కు అనుకూలంగా రిపోర్టురాసేందుకు ఎస్‌ఐ శంకరయ్య మొదట రూ.3లక్షలు,తరువాత 2లక్షలు చొప్పున చివరకు రూ.65వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణ. ఏసీబీ అధికారుల ట్రాప్‌మేరకే రాజేష్‌గౌడు ఇలా చేస్తున్నాడని ఎసై ్స భావించాడు. దీంతో తనను రివాల్వర్‌తో బెదిరించినట్లు రాజేష్‌గౌడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే తుంగభద్ర పుష్కరాలు,సీఎం పర్యటన, వినాయక నిమజ్జనాలు ఉండటంతో ఎసై ్సపై చర్యలు ఆలస్యమయ్యాయి. ఎమ్మిగనూరుకు చెందిన ప్రధాన ప్రజాప్రతినిధి హోంమంత్రితో చెప్పించానని, ఇక చర్యలుండవని అభయమిచ్చాడు. రెండురోజుల క్రితం జరిగిన బదిల్లో ఎసై ్స పేరులేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఊహించని రీతిలో ఆదివారం వీఆర్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎమ్మిగనూరు రూరల్ ఎసై ్సకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రాజకీయ పైరవీలు,ఆర్థిక లావాదేవీల్లేవి ఎస్‌ఐ శంకరయ్యను రక్షించలేకపోయాయని పోలీస్‌శాఖలో చర్చ.
ఎస్‌ఐపై కేసు నమోదు:
తనను రివాల్వర్‌తో చంపుతానని బెదిరించాడనీ వడ్డీ వ్యాపారి రాజేష్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణ ఎసై ్స శంకరయ్య, కానిస్టేబుల్ రవిపై అండర్ 384,506,రెడ్‌విత్ 511ఐపీసీ,రెడ్‌విత్ 34ఐపీసీ అండర్ సెక్షన్ 156 క్లాస్3 సీఆర్‌పీసీ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ నాగేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement