orderly
-
తహసీల్దార్ సేవలో..టీ బాయ్‌గా, కారు తుడుస్తూ!
సాక్షి, ఉలవపాడు(ఒంగోలు) : ప్రజలకు సేవలు చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది తమ ఉన్నతాధికారుల సేవలో నిమగ్నమైపోతున్నారు. బానిసత్వ వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా నేటికీ పలుచోట్ల అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పలు పనులు చేయించుకుంటూ గతంలో పోలీసు శాఖలోని ఆర్డర్లీ వ్యవస్థను జ్ఞప్తికి తెస్తున్నారు. ఉలవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఈ పరిస్థితి నెలకొంది. ఉలవపాడు వీఆర్వోగా పనిచేస్తున్న రామాంజనేయులు తహసీల్దార్ నగేష్ వచ్చిన వెంటనే బస్టాండ్‌కు వెళ్లి ఫ్లాస్క్‌లో టీ తీసుకు రావాలి. వీఆర్వోగా ప్రజలకు సేవ పనిచేయాల్సిన అధికారి టీ బాయ్‌గా అవతారమెత్తడం గమనార్హం. ఇక తహసీల్దార్ విధులకు కారులో వస్తారు. ఆ కారును కరేడు వీఆర్ఏ రామకోటేశ్వరి భర్త శ్రీను రోజూ శుభ్రం చేయాలి. రామకోటేశ్వరి బదులు విధులకు ఆమె భర్త శ్రీను హాజరై తహసీల్దార్ వ్యక్తిగత సేవలో తరలిస్తూ ఉంటాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీఆర్ఏ భర్త కారును శుభ్రం చేస్తూ.. వీఆర్వో టీఫ్లాస్క్ తెస్తూ కనిపించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డర్లీ వ్యవస్థపై ఇటీవల స్థానికంగా పెద్ద చర్చే నడుస్తోంది. బయట చెబితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని ఫొటోలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటం గమనార్హం. అటెండర్లతో టీ తెప్పించుకోవచ్చని, అలా కాకుండా ఒక అధికారితో తహసీల్దార్ టీ తెప్పించుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సొంత కారును కార్యాలయంలో కడిగించడం ఎంతవరకు సమంజసమని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. -
వార్నింగ్‌తోనే సరి!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ఆర్డర్లీ’పై ఆరా ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం. హెచ్చరించి వదిలేస్తారా? చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది. -
'వెట్టి'పై డీజీపీ కార్యాలయంలో విచారణ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎస్పీపై వెట్టిచాకిరి వ్యవహారానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. డీఐజీ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు మంగళవారం 18మంది హోంగార్డులు హాజరయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. -
ఖాకీల్లో కలవరం
-
ఖాకీల్లో కలవరం
* ఎస్పీ ఇంట్లో ఆర్డర్లీ విధానంపై కదలిక * పోలీస్ బాస్ అరాచకాలను ఎండగట్టిన హోంగార్డులు * హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌తో పోలీసుల్లో అలజడి సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పోలీస్ విభాగంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనూహ్యంగా కొందరు హోంగార్డులు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ అరాచకాలను ఎండగట్టారు. క్యాంపు కార్యాలయంలో, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ హోంగార్డులతో చాకిరీ చేయించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తంతు జిల్లా పోలీస్వర్గాలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. పోలీస్ బాస్‌పై హోంగార్డుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. హెడ్‌కానిస్టేబుల్‌పై వేటు.. ఇదిలా ఉండగా బంట్వారం పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఎస్పీ నవీన్‌కుమార్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోంగార్డుల మీడియా సమావేశం జరిగిన కొద్ది సమయంలోనే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం గమనార్హం. మహేష్ గతంలో ఎస్పీ కార్యాలయంలో సీసీగా పనిచేశారు. అప్పట్లో పెట్రోల్, డీజిల్ వినియోగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే అకస్మాత్తుగా మహేష్‌పై సస్సెన్షన్ వేటు వేయడం పోలీస్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. హోంగార్డులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో మహేష్ పోస్టు చేశాడనే ప్రచారం సాగుతోంది. ఈ చర్యలపై ఎస్పీ నవీన్ ఆగ్రహించి సస్పెండ్ చేసినట్లు సర్వత్రా గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్
రంగారెడ్డి: రంగారెడ్డి ఎస్పీ నవీన్‌కుమార్ ఇంట్లో 'హోమ్‌గార్డుల వెట్టిచాకిరి' కేసు కొత్త మలుపు తిరిగింది. హోమ్‌గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తుంటే...కానిస్టేబుల్ మహేశ్నే ఎస్పీ సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశారని సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే హోంగార్డులు తన ఇంట్లో పని చేసిన వ్యవహారంలో కుట్రజరిగిందని మహేశ్ అనే కానిస్టేబుల్ పథకం ప్రకారం ఈ పని చేశాడని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. దీని పై విచారణ కూడా చేయిస్తామన్నారు. ఇంతలోనే మహేశ్ పై వేటు పడటం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్