జిల్లా పోలీస్ విభాగంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనూహ్యంగా కొందరు హోంగార్డులు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ అరాచకాలను ఎండగట్టారు.