87 నోటీసులు, రూ.42 కోట్లు అటాచ్
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా 2016 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన బినామీ లావాదేవిల చట్టం కింద దేశవ్యాప్తంగా 87 నోటీసులు పంపామని, రూ.42 కోట్ల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నామని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.
నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము బినామీ అకౌంట్లు, జన్ ధన్ ఖాతాల్లో జమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన అకౌంట్లను జల్లెడ పట్టేందుకు ఐటీ అధికారులు చర్యలు మొదలుపెట్టారంది.