
న్యూఢిల్లీ: పంచదార దిగ్గజం బలరామ్‌పూర్ చినీ షేర్లను బైబ్యాక్ చేస్తోంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా రూ.148 కోట్ల విలువైన 3.69 శాతం వాటాకు సమానమైన 84 లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తామని బలరామ్‌పూర్ చినీ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.175కు కొనుగోలు చేస్తామని పేర్కొంది.
శుక్రవారం ముగింపు ధర(రూ.145)తో పోల్చితే ఇది 20 శాతం అధికం. దాదాపు 40 శాతం వాటా ఉన్న ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొంటారని కంపెనీ తెలిపింది. కాగా షేర్ల బైబ్యాక్ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో బలరామ్‌పూర్ చినీ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, 146ను తాకింది. 5.5% లాభంతో రూ.145 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment