Balarampuram
-
బలరామ్‌పూర్ చినీ షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: పంచదార దిగ్గజం బలరామ్‌పూర్ చినీ షేర్లను బైబ్యాక్ చేస్తోంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా రూ.148 కోట్ల విలువైన 3.69 శాతం వాటాకు సమానమైన 84 లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తామని బలరామ్‌పూర్ చినీ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.175కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. శుక్రవారం ముగింపు ధర(రూ.145)తో పోల్చితే ఇది 20 శాతం అధికం. దాదాపు 40 శాతం వాటా ఉన్న ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొంటారని కంపెనీ తెలిపింది. కాగా షేర్ల బైబ్యాక్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బలరామ్‌పూర్ చినీ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, 146ను తాకింది. 5.5% లాభంతో రూ.145 వద్ద ముగిసింది. -
భర్తకు నిప్పుపెట్టిన భార్య
ఉత్తర్ ప్రదేశ్ : భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ భర్త మరణానికి దారి తీసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలరాంపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలరాంపూర్కు చెందిన నాంకె(35), పూజా(30) భార్యాభర్తలు. ఈ నెల 7వ తేదీన తన భార్యను ఫోన్లో ఎక్కువగా మాట్లాడవద్దని భర్త హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అన్నం తిని పడుకున్న తన భర్త నాంకేపై భార్య పూజ కిరోసిన్ పోసి నిప్పంటించింది. నాంకే అరుపులు విన్న అతని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు లక్నోకు తీసుకువెళ్లమని సూచించారు. చికిత్స పొందుతూ నిన్న(సోమవారం) నాంకే మరణించాడు. భర్త మరణించడంతో భార్య పరారైంది. నాంకే సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బలరాంపురంలో నగర వనం
గార: బలరాంపురం పరిసరాల్లో నిర్మించే ‘నగరవనం’ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బలరాంపురంలో 66వ వనమహోత్స కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్న నగరవనం జిల్లా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. దీనికి కోసం పది కోట్ల రూపాయలను విడుదల చేసి పనులు చేపడతామన్నారు. అన్ని రకాల మొక్కలను పెంచడంతోపాటు, పార్కు, ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. అన్ని శాఖల కార్యాలయాల్లో మొక్కలు పెంచేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా శ్రీకాకుళం జిల్లా వాసులు ఉండటం బాధాకరమన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ 165 ఎకరాల్లో నిర్మించే నగరవనాన్ని పర్యాటకులను ఆకర్షించేలా సుందరంగా నిర్మిస్తామన్నారు. ఈ ఏడాది ఒక కోటీ ఐదు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఏఏస్ ఖాన్ మాట్లాడుతూ భూభాగంలో 33 శాతం చెట్లు ఉండాల్సి ఉండగా కేవలం 16 శాతం ఉండటం బాధాకరమన్నారు. మొక్కలు నరికేవాళ్లను ఎందుకు నరుకుతున్నారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. తొలుత నగరవనం పనులకు మంత్రి అచ్చెన్న శంకస్థాపన చేశారు. ఇందుకు సంబంధిన మ్యాపును పరిశీలించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నరసన ్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జేసీ వివేక్‌యాదవ్, జేసీ-2 రజనీకాంతరావు, ఎంపీపీ గుండ అమ్మలు, డీఎఫ్‌వో విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ తనూజారాణి, ఆర్డీవో బలివాడ దయానిధి పాల్గొన్నారు.