
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తర్ ప్రదేశ్ : భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ భర్త మరణానికి దారి తీసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలరాంపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలరాంపూర్‌కు చెందిన నాంకె(35), పూజా(30) భార్యాభర్తలు. ఈ నెల 7వ తేదీన తన భార్యను ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడవద్దని భర్త హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అన్నం తిని పడుకున్న తన భర్త నాంకేపై భార్య పూజ కిరోసిన్ పోసి నిప్పంటించింది.
నాంకే అరుపులు విన్న అతని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు లక్నోకు తీసుకువెళ్లమని సూచించారు. చికిత్స పొందుతూ నిన్న(సోమవారం) నాంకే మరణించాడు. భర్త మరణించడంతో భార్య పరారైంది. నాంకే సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment