న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీటి అమలులో మరో కీలక అడుగుపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బిల్లును అమలు చేయాలన్న లక్ష్యంతో చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత పన్ను విధానంలో కీలక సంస్కరణగా, సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లుకు సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ కౌన్సిల్ కు ఆమోదం తెలిపింది. గత వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో, నేడు సమావేశమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ, జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఉంటారు. ప్రధాన అటు ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ కొన్ని సూచనలు, సలహాలు అందించింది.
ఈ కౌన్సిల్ కు ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఈమేరకు సెప్టెంబర్ 22 , 23 తేదీల్లో ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశానికి నిర్ణయించింది.
జీఎస్టీ కౌన్సిల్కు కేబినెట్ ఆమోదం
Published Mon, Sep 12 2016 3:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
Advertisement