దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: దివాలా బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. లోక్‌సభలో ఈ బిల్లుకు మే 5నే ఆమోదముద్ర పడింది. రెండు సభలు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుదీర్ఘకాలయాపన లేకుండా... కంపెనీలు, వ్యక్తులు అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్థిష్ట కాల వ్యవధుల్లో దివాలా సమస్యల పరిష్కారం, తద్వారా రుణ సమస్యల నివారణ ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో తాజా బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. చర్చకు ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా సమాధానం ఇస్తూ... దీనిని చరిత్రాత్మక బిల్లుగా అభివర్ణించారు. దివాలా వ్యవహారాల ప్రక్రియ మొత్తం 180 రోజుల్లో పూర్తికావాలని బిల్లు నిర్దేశిస్తోంది.