సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్‌కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.
ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా?
Comments
Please login to add a commentAdd a comment