ఢిల్లీ : కరోనా కేసులు దేశ రాజధాని ఢిల్లీలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. రోజూ వారి కరోనా కేసుల విషయంలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే ఢిల్లీ 12వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు. గడిచిన 21 రోజుల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతుండగా ఢిల్లీలో తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా 1195 కరోనా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,35,598కు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 10,705 యాక్టివ్ కేసులే ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అంతకుముందు భారత్‌లో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మహారాష్ర్ట తర్వాత రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీలో వరుసగా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పడు 496 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని చెప్పారు. (19 మంది వృద్ధులను ఒకే గదిలో బంధించి..)
ఢిల్లీ వ్యాప్తంగా శనివారం నుంచి తదుపరి రౌండ్ సెరోలాజికల్ సర్వే ప్రారంభమవుతుందని సత్యంద్ర జైన్ తెలిపారు. దీని ప్రకారం ప్రతి జిల్లా వైద్యాధికారులు తమ పరిధిలో ఉండే జోన్లలో సర్వే నిర్శహించాల్సి ఉంటుంది. గత సర్వేలో 24 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తేలింది. రాష్ర్టంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, హర్యానాలలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూడగా, 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. (భారత్: 16 లక్షలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment