
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లోకి వలసలు జోరందుకున్నాయి. హరియాణాకు చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సామాజిక కార్యకర్తలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అక్కడ కూడా అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో హిమచల్ ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత, ప్రస్తుత పాలకులు విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
హిమాచల్‌తో పాటు, 2024లో ఎన్నికలు జరగనున్న కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హరియాణాలోనూ పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తమకు నమ్మకం ఉందని సత్యేందర్ జైన్ అన్నారు. (క్లిక్: ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా)
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ నిర్ణయించింది. గుజరాత్‌ను 1995 నుంచి బీజేపీ పరిపాలిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..)
Comments
Please login to add a commentAdd a comment