సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోండి: సుప్రీం | SC asks Delhi HC to decide Satyendar Jain bail plea in ED case | Sakshi
Sakshi News home page

సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోండి. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం ఆదేశం

Published Tue, Jun 25 2024 6:48 PM | Last Updated on Tue, Jun 25 2024 6:59 PM

SC asks Delhi HC to decide Satyendar Jain bail plea in ED case

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.

కాగా  తన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ సత్యేందర్‌ జైన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేర‌కు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్‌ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ  తేదీ అయిన జులై 9న  పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

అయితే సుప్రీంకోర్టులో ఇప్ప‌టికే పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసుతో త‌న పిటిష‌న్‌ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

ఇక  28న జైన్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సూచించింది.  త‌దుప‌రి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది.  

అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్‌ జైన్‌పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఆయనను 2022లో మే 20న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్‌ 6న ట్రయల్‌ కోర్టు ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement