Too Many Munna Bhai MBBS's In BJP: BRS Leader KTR - Sakshi
Sakshi News home page

బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో? ఆ ఇద్దరు ఎంపీలు కూడా.. : కేటీఆర్‌ సెటైర్‌

Published Tue, Apr 4 2023 11:16 AM | Last Updated on Tue, Apr 4 2023 12:23 PM

Too Many Munna Bhai MBBSs In BJP Says BRS Leader KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ విద్యార్హత అంశం మరోసారి తెర మీదకు రాగా.. బీజేపీ నేతల విద్యార్హత అంశాన్ని లేవనెత్తుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బీజేపీలో మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌ టైప్‌ వ్యక్తులు ఎందరో ఉన్నారంటూ ఓ ట్వీట్‌ చేశారాయన. 

బీజేపీలో మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌ తరహా వ్యక్తులు ఎంతోమంది ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్‌ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజస్తాన్‌, తమిళనాడు యూనివర్సిటీల సర్టిఫికెట్లను ఫోర్జింగ్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  కానీ, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు విషయం(ఫేక్‌ విద్యార్హత ప్రస్తావిస్తూ..) పేర్కొనడం క్రిమినల్‌ నేరం కాదా? ఒకవేళ దోషులుగా వాళ్లపై లోక్‌సభ స్పీకర్‌ అనర్హులుగా వాళ్లను ప్రకటించరాదా? అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: మన ప్రధానులు అసలు ఏం చదివారో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement