నా పనితీరు చూసి చెప్పండి: స్మృతి | judge me by my work: Irani on education qualification row | Sakshi
Sakshi News home page

నా పనితీరు చూసి చెప్పండి: స్మృతి

Published Fri, May 30 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

నా పనితీరు చూసి చెప్పండి: స్మృతి

నా పనితీరు చూసి చెప్పండి: స్మృతి

న్యూఢిల్లీ: తన విద్యార్హతకు సంబంధించిన వివాదంపై మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనం వీడారు. తన పనితనం చూసి ఆ తర్వాత న్యాయం చెప్పాలని రాజకీయ నాయకురాలిగా మారిన ఈ టీవీ నటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కనీసం గ్రాడ్యుయేట్ కూడా కాని స్మృతి మానవ వనరుల శాఖను ఎలా నిర్వహించగలరంటూ కాంగ్రెస్ విమర్శించిన రెండురోజులకు ఆమె స్పందించారు.

తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తన దృష్టిని మళ్లించేందుకు సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2004, 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసిన ఆమె పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లు దాఖలు చేసిన విషయం వెలుగుచూడటంతో.. తన విద్యార్హతకు సంబంధించి తలెత్తిన వివాదానికి స్మృతి కేంద్ర బిందువుగా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement