విద్యార్థులతో స్మృతీ ఇరానీ భేటీ | smriti irani meeting with students in vijayawada | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో స్మృతీ ఇరానీ భేటీ

Published Tue, Jun 7 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

smriti irani meeting with students in vijayawada

విజయవాడ :  కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మంగళవారం విజయవాడలో పర్యటించారు. అందులో భాగంగా పాతబస్తీలోని గుజరాత్ సమాజ్ స్కూల్ను సందర్శించారు. స్కూల్లోని నూతన ల్యాబ్ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో ఆమె ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

ఆమెతోపాటు బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, ఆ పార్టీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరీ, మంత్రి కామినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో స్మృతీ ఇరానీ పాల్గొనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement