న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా నిధుల కేటాయింపుల్లో భారీ కోత పెట్టిందని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. నిధుల సమస్య గురించి మేయర్లు సీఎం కేజ్రీవాల్‌కు విన్నవించినా ఆయన పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో అవసరమైన మేరకు నిధులు కేటాయించామని, ఏ అంశానికి కోత పెట్టలేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నిధులు కేటాయించకుండా ఆయా అంశాలపై రాజకీయం చేస్నున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు మేయర్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్‌కు రూ. 302 కోట్ల నిధులు ఇవ్వాలని సంబంధింత మేయర్ యోగేంద్ర చందోలియా విన్నవించినా సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రుణం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని అజయ్ మాకెన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి సహాయం తీసుకుందామని యోగేంద్రతోపాటు ఇతరులు కూడా సీఎంకు విన్నవించారన్నారు. తూర్పు, ఉత్తర కార్పొరేషన్లు తమ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతభత్యాలు చె ల్లించలేదని మాకెన్ గుర్తు చేశారు.
అన్ని కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని ఆప్ ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకుంటూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తమ హయంలో కార్పొరేషన్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేశామన్నారు. విద్య, పారిశుద్ధ్యం, వైద్యం, అనధికార కాలనీల అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలకు విరివిగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మురికివాడల్లో సౌకర్యాల కల్పనకు కూడా భారీగా నిధులిచ్చామన్నారు.
కార్పొరేషన్ల ఆర్థిక స్థితి దారుణం
Published Mon, Mar 30 2015 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement